6, జూన్ 2013, గురువారం

నిజమైన తల్లి కావాలి :



దేశంలో మాత్రు శక్త్రి పెరగాలి. తన సంతానం దేశ హితం కొరకు పనిచేయాలి అనే ఆలోచన కలికిగిఉన్న   మాత్రు మూర్తుల  సంఖ్య పెరగాలి. తన సంతానాన్ని అవిటివాడిగా, స్వార్ధపరుడిగా, లోభిగా, శక్తి హినుడిగా, ఆధారపడి బ్రతికే వాడిలా కాకుండా,

సింహంలా, సమాజానికి ఉపకారం చేసేవాడిలా, నిజాయితీ పరుడిలా, నిస్వార్ధపరుడిలా, శివాజీ మహారాజ్ లా, భగత్ సింగ్ లా, ఝాన్సి రాణిలా అందరికొరకు నా సంతానం, నా పిల్లలు బ్రతకాలి అనుకునే తల్లులు దేశానికి కావాలి.

వెకిలి వేషాలు వేస్తూ, చిలిపి చేష్టలు చేస్తూ, పిచ్చి రాతలు రాస్తూ ఎదుటి వారిని పనికిమాలిన ఊహలలో ముంచి, చేతకాని చవటలుగా, దద్దమలుగా సమాజాన్ని తయారుచేసి తనచుట్టూ తిప్పుకునే ఆడది సమాజానికి అవసరం లేదు.

ఎందుకంటే తల్లి మాత్రమె సమాజాన్ని దిద్దగలదు. ఎందుకంటే మొదటి  గురువు తల్లే కావున. సమాజం బాగుపడినా, చెడిపోయినా దానికి కారణం తల్లి మాత్రమే.

షాహ్జి భోంస్లే తనని వదలి వెళ్ళినా, శివాజీని వెన్నంటి వీర సింహాన్ని తయారుచేసినా,  17 ఏళ్ళ ప్రాయంలో ఉరితాడు ను పులమాలగా ధరించేలా భగత్సింగ్ ను తీర్చి  దిద్దిన, నిజ ధర్మం కొరకు పరాయివారి ముందు ఎలుగెత్తి నినదిన్చేలా స్వామీ వివేకానందను పెంచినా, బ్రిటిష్ దోపిడీ వ్యవస్తను కాలరాసేలా ఎదిరించి పెద్ద  సైన్యాన్ని తయారుచేసి యుద్ధం ప్రకటించేలా  సుభాష్ బోసును తయారుచేసినా, కాలినడకతో తెల్లవారిని తరిమేసెలా బాపూజీని పెంచినా  ( ఇవి కొన్నిమాత్రమె )  అది తల్లి ఘనతె.

ఈరోజు అమ్మ అందుకు వ్యతిరేకంగా భావి భారత దేశాన్ని నడిరోడ్డు న వదలి డబ్బు సంపాదనలో తిరగడం చాలా విచారకరం, బాధాకరమ్. సమ్పాదించాలి. కాని పిల్లలకు సంస్కారం నేర్పెడేవారు ?  ఇది పెద్ద ప్రశ్న......

తల్లి శక్తివంతం కావాలి.  డాక్టర్లు, ఇంజనీర్లు కాదు, నిజమైన తల్లులు కావాలి. ... దేశానికి నిజమైన తల్లులు  కావాలి .....



25, సెప్టెంబర్ 2010, శనివారం

శ్వాస మరియు జీవతం

మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నా, అవసరమున్న వరకు పలకరించుకోవడం ఉత్తమం. కాదంటారా ? అయినా మనిషి పుట్టగానే చేసే మొదటి పని ఏడవటం కాదు. నిజం. శ్వాస తీసుకోవడం. తరువాతే ఏడవటం. దతనంతరం జీవితాంతం అందరిని ఏడిపించడం. గతించడం అంటే తుది శ్వాస వదలటం. అంటే రెండు శ్వాసల మధ్య జీవితం ఇమిడి ఉన్నది.  ఎప్పుడు మొదటి శ్వాస తీసుకున్నావు ? అని అడిగితే వ్యక్తి తను పుట్టిన రోజు చెపుతాడు. చివరి శ్వాస ఎప్పుడు వదులుతావు ? అని అడిగితే ఎవరైనా చెప్పగలరా ? ఈ బ్లాగ్ కంపోజ్ చేస్తూ ఉండగానే నా తుది శ్వాస నన్ను వదిలి వెళ్లిపోవచ్చు. కాదంటారా ? ఎవ్వరి జీవితమైన అంతే . కాదనే ధైర్యం ఎవరికీ లేదు. అలా సాసిన్చగలిగితే ఆ వ్యక్తి దైవ సమానుడే. అందమైన భవితవ్యం ను గూర్చి ఆలోచించే ప్రతి వ్యక్తి, జేవితంలో ఎంతో విలువైన శ్వాసను గూర్చి రోజులో ఒక్క క్షణమైన వెచ్చిస్తే అద్భుతాలు చేయగలుగుతాడు. ప్రపంచం మరింత అందంగా మారుతుంది అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం.ఈ పరుగుల యుగంలో ఇది అవసరమా ? అని అనుకోవచ్చు. కాని శ్వాసే మన జీవితము ఐనప్పుడు దానిని ఉపేక్షించడం ఎంతవరకు సమంజసం ? మరికొన్ని విషయాలతో మరల కలుద్దాం. అంతవరకూ నమస్కారములు. ఇట్లు మీ రాణా.................

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

జీవితము మరియు శ్వాస

మిత్రులారా చాలా కాలము తరువాత మీ ముందుకు వచ్చినందుకు ఆనందంగాను మరియు ఆలాస్యమునకు ఒకింత చింతిస్తున్నాను. జీవితము చాలా చిన్నది. సగము నిద్రలోనే గడచిపోతుంది. సగటు మానవ జీవితం అరవై వత్సరాలే. మిగిలిన ముప్పైలో బాల్యం పది, చదువుల పేరుతొ పది సంత్సరాలు, మిగిలిన పది, ఆశల ఆడిఆశల నడుమ వృద్దాప్యం రానే వస్తుంది. అయినా మనిషి తనను తాను తెలుసుకోకుండా, ఎందుకు వచ్చానో తెలుసుకోకుండా కాలాన్ని బ్రతుకు పోరాటాలతో, ధనం వేటలో పరుగుపెడుతూ, సుఖాలను వదులుకొని నరకం వైపుగా పయనం సాగిస్తున్నాడు. మిగిలిన వారికి కూడా నరకాన్ని చూపిస్తున్నాడు. వీటన్నిటికి కారణం ఆశా పూరితమైన మనసు. చూసిన ప్రతి విషయాన్ని కోరుకుంటుంది. సొంతం చేసుకోవాలనుకుంటుంది. మనసును నియంత్రించడం కాదు దుస్సాద్యం. కాని అంతే సుసాద్యం కూడా. పరమ గులువుల సూచనల మేరకు, వారు ఆచరిస్తూ మనకు తెలిపినది, నరక సద్రుసమైన మన జీవితాన్ని స్వర్గంగా మార్చుకుని, అందరికి సంతోషాన్ని, ఆనందాన్ని పంచిపెట్టగలిగే ఏకైక మార్గం మన చేతిలోనే ఉన్నది. ప్రపంచం మొత్తం ఈ మార్గంలో ప్రస్తుతం ప్రయాణం ఆరంభించింది. అమెరికాలో సంవత్సరానికి లక్ష ముప్ఫై వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. అదే శ్వాస. కలుద్దాం. శలవు.

17, జులై 2009, శుక్రవారం

Suswaagatham

భారతీయులారా మీ అందరకు స్వాగతం మరియు సుస్వాగతం. మనమందరం యువకులమే. కాని వయోభేదాలు మనలను ఒక విధంగా దూరం చేస్తున్నాయని అనిపిస్తుంది. అందుచేత మనకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అన్నది నిజం కాదంటారా ? వీటికి మనం పరిష్కారాలు వెదకాలి. అందుకే మనం కలవాలి, మాట్లాడాలి మరియు కలసి కొంత పని చేయాలి. తద్వారా భారతీయ గౌరవమును కాపాడాలి. అందుకు మీరందరు సిద్ధమేనా ?

మీ రాణా